సంతోషంగా సాగుతున్న వైవాహిక జీవితంలోకి వివాహేతర సంబంధాలు వచ్చి చేరి పచ్చటి సంసారాన్ని నాశనం చేస్తున్నాయి. ఇక భర్తను కాదని పరాయివాడితో శారీరక సుఖాలు తీర్చుకుంటూ కొంతమంది వివాహితలు భర్తను పక్కకునెడుతున్నారు. కాగా తన క్షణిక సుఖాలకు అడ్డొస్తున్నాడని ఏకంగా సొంత అక్కకొడుకునే హతమర్చిందో మహిళ. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నిజామాబాద్ జిల్లాలోని హన్మంతు తండా ప్రాంతం. లక్ష్మీ అనే మహిళ భర్తతో పాటు సంతోషంగా జీవిస్తూ ఉంది. అయితే లక్ష్మీ స్థానికంగా మరో యువకుడితో ఎఫైర్ ను నడిపిస్తూ యధేచ్చగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక అక్క బావ మరణించడంతో వారి కుమారుడును రాజు లక్ష్మీ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే లక్ష్మీ ఎఫైర్ ను కనిపెట్టిన రాజు ఓ రోజు పిన్నిని ప్రశ్నించాడు. నా చీకటి కాపురానికి అక్క కొడుకు అడ్డొస్తున్నాడని భావించి ఎలాగైన రాజుని చంపాలని ప్లాన్ రచించింది.
ఇది కూడా చదవండి: మేనకోడలిపై మామ లైంగికదాడి.. పెళ్లైనా వదలకుండా బ్లాక్ మెయిలింగ్!
ఇదే విషయాన్ని ప్రియుడికి కూడా చెప్పడంతో పథకం ప్రకారం రాజు గొంతుకు చున్నీతో ఉరేసి చంపారు. దీంతో రాజు మరణంపై స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులుగా లక్ష్మీ ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.