నేటి కాలంలోనే అనేక మంది ప్రేమ పేరుతో ఆడదాన్ని ఓ ఆట బొమ్మలా చూస్తూ కోరికలు తీర్చుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని వంచించి సమయం దొరికినప్పుడల్లా శారీరకంగా కలుసుకుని గర్బవతిని చేస్తున్నారు. గర్భం దాల్చక అబర్షాన్ చేస్తూ తర్వాత పెళ్లికి నిరాకరిస్తున్నారు. ఇదే విధంగా నమ్మించి మోసం చేసిన ఓ మోసగాడు ఏకంగా యువతిని గర్భవతిని చేసి కాదుపొమ్మన్నాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరులోని విజయనగరకు చెందిన యువతికి, స్థానికుడైన గణేశ్ అనే యువతికి మూడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్ల పాటు ఇద్దరు ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు, బాసలు చేసుకున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ప్రియుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోరికలు తీర్చుకున్నాడు. దీంతో నమ్మిన ప్రియురాలు అతనితో శారీరకంగా గడిపింది. గర్భం దాల్చడంతో యువతి పెళ్లి చేసుకోవాలని ఒప్పించింది.
ఇది కూడా చదవండి: అందమైన వీరి ప్రేమ కథలో అంతులేని విషాదం.. వీళ్లు చేసిన పొరపాటు ఇదేనా?
దీంతో యువకుడు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిని అరెస్ట్ జైలుకు పంపారు. అనంతరం బెయిల్ పై తిరిగొచ్చిన గణేశ్ మళ్లీ యువతితో గడిపి గర్భవతిని చేశాడు. ఇప్పుడు కూడా పెళ్లికి నిరాకరించి, ప్రియురాలి కడుపుపై కాలుతో తన్నాడు. దీంతో ఆ యువతికి గర్భస్రావం అయింది. ఇక యువతి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.