మైసూరులో దారుణం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని రీతిలో తండ్రీకొడుకులు పాడు పనికి పాల్పడ్డారు. ఇంటి పక్కన మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీశారు. ఇక అవే వీడియోలను సదరు మహిళకు పంపి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక మైసూరు పరిధిలోని హెబ్బలలో ఓ మహిళ నివాసం ఉంటుంది. వీరి ఇంటికి పక్కనే మరో కుటుంబం కూడా నివాసం ఉంటున్నారు. అయితే.. ఈ ఇంట్లో ఉంటున్న తండ్రీ కొడుకులు పక్కింటి మహిళపై కన్నేశారు. ఎలాగైన లొంగదీసుకుని అత్యాచారం చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇక ఇందులో భాగంగానే ఓ రోజు ఆ మహిళ స్నానం చేస్తుండగా తండ్రీకొడుకుల కలిసి వీడియో తీశారు. కొన్ని రోజుల తర్వాత వీడియోలను సదరు మహిళ కు వాట్సప్ ద్వారా పంపారు. ఈ వీడియోలను చూసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కు గురైంది.
ఇది కూడా చదవండి: Woman: భర్తకి అన్యాయం చేస్తూ.. లవ్ యూ సోనా అంటూ లెటర్ రాసి!
మహిళను ఆ దుర్మార్గులు లైంగికంగా వేధింపులకు గురి చేశారు. దీంతో పాటు డబ్బులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేటుగాళ్ల వేధింపులు ఎక్కువవడంతో ఆ మహిళ సహించలేకపోయింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు తండ్రీకొడుకుల దారుణంపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.