తాగిన మత్తులో ఓ యువతి నడీ రోడ్డుపై చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వాహనదారులతో దుర్భాషలాడుతూ, ఏకంగా పోలీస్ ఆఫీసర్ గల్లా పట్టుకుని రోడ్డుపై రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్విట్టర్ లో కాస్త వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే..ముంబైలో ఓ పార్టీ నుంచి అర్థరాత్రి తిరిగి వస్తుండగా ఓలా క్యాబ్‌లో ముగ్గురు యువతులు వెళ్లారు. విపరీతంగా మద్యం మత్తులో ఉన్న యవతుల్లో ఒకరు రైడ్ సమయంలో క్యాబ్ డ్రైవర్‌పై దుర్భాషలాడారు. ఓ యువతి డ్రైవర్‌ను కూడా బయటకు గెంటేసి కారును నడిపింది.
Video 2 pic.twitter.com/GAgxVifzV7
— Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) June 19, 2022
ఇక ఇంతటితో ఆగిందా అంటే అదీ లేదు. రోడ్డుపై వచ్చి పోయేవారి పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తూ నోటికొచ్చిన మాటలు అనేసింది. దీంతో వెంటనే కొందరు స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ యువతి ఏకంగా ఓ పోలీస్ అధికారితో దుర్భాషలాడుతూ విర్రవీగి ప్రవర్తించింది. ఏకంగా ఆ పోలీస్ అధికారి కాలర్ పట్టుకుని బెదిరించింది.
ఇది కూడా చదవండి: Goa Beach: గోవా బీచ్ లో కారుతో విన్యాసాలు.. చివరకు ఇలా!
వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళా పోలీసులను పిలిపించారు. అయితే ఆ యువతి అలా ప్రవర్తించడంతో ఆమె స్నేహితురాలు సైతం అపే ప్రయత్నం చేశారు. తాగిన మత్తులో ఆ యువతి వారిపై కూడా చేయి చేసుకుంది. ఇదంతా వీడియో తీసిన క్యాబ్ డ్రైవర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తాగిన మత్తులో ఈ యువతి ఇలా ప్రవర్తించడం ఏంటని కొందరు అసహ్యించుకుంటున్నారు. నడీ రోడ్డుపై రచ్చ రచ్చ చేసిన ఈ యువతి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
A thread of 11 videos, drunk girl abusing everyone including Police
Video 1 pic.twitter.com/SC4AGM7h5j— Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) June 19, 2022
Video 8 pic.twitter.com/bS1ZVP4Jzq
— Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) June 19, 2022