నాకు పెళ్లై ఏడాది గడుస్తుంది. కానీ, ఏనాడు కూడా నా భర్త నాతో శారీరకంగా కలిసింది లేదు. అసలు నా భర్త మాగాడే కాదు. ఈ విషయంపై ఎన్నో సార్లు నా భర్తను నిలదీసే ప్రయత్నం చేశాను. అప్పటి నుంచి నా భర్త, అత్తమామలు నాపై దాడులు చేస్తూ మానసికంగా, శారీరకంగా తీవ్ర హింసకు గురి చేస్తున్నారని, నాకు మీరే న్యాయం చేయండి అంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటన వెనుక అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని ఝాట్ కపూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను 2021లో కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లి తంతులో భాగంగా అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి భారీగానే కట్నకానుకలు సమర్పించారు. అలా పెళ్లై కొన్ని నెలలు గడిచింది. కానీ, ఏనాడు కూడా భర్త భార్యతో శారీరకంగా కలిసిందే. పైగా రాత్రిళ్లు పెళ్లి బట్టలు ధరించడం, మేకప్ వేసుకుని ఫొటోలు దిగడం వంటివి చేసేవాడు. ఇదే కాకుండా అప్పుడప్పుడు అమ్మాయిల్లా కూడా ప్రవర్తించేవాడు. ఇక భర్త వేశ, భాషలు పూర్తిగా తేడాగా ఉండడంతో భార్యకు అనుమానం వచ్చింది.
వెంటనే ఆ యువతి ఇదే విషయంపై అత్తమామలతో తేల్చుకోవాలని ప్రశ్నించింది. దీనికి అత్త సమాధానమిస్తూ.. వాడికి చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు అని, ఇప్పుడెలా మారతాడని తెలిపారు. దీనిని సహించలేకపోయిన ఆ మహిళ.. తన తల్లిదండ్రులకు అసలు నిజాలు చెప్పింది. నా పరువు బయటపెడుతుందని గ్రహించిన ఆ మహిళ భర్త, అత్తమామలు ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. భర్త రాత్రిళ్లు భార్య ప్రైవేట్ పార్ట్ ల్లో స్క్రూ డ్రైవర్ జొప్పించేవాడు. ఇక భర్త, అత్తమామల టార్చర్ ను భరించలేక పోయిన భార్య.. ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.