మారుతున్న కాలానికి అనుగుణంగా దొంగతనంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే మార్గాలను చాలా మంది వెతుక్కుంటూ చివరికి దొంగలుగా మారిపోయారు. అచ్చం ఇలాగే అడుగులు వేసిన ఓ యువకుడు వరుస దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. ఇటీవల కూడా ఓ మహిళ తాళిబొట్టున దొంగిలించి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దొంగతనానికి పాల్పడ్డ ఆ యువకుడి తల్లి కుమారుడికి ఊహించని షాకిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చని ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది ముంబై విష్ణునగర్ లోని పూలే నగర్ ప్రాంతంలో ఓ యువకుడు తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఈ యువకుడు తక్కువ సమయంలో కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గాలను వెతికాడు. చివరికి అతడికి దొంగతనమే మార్గంగా కనిపించింది. దీంతో స్థానికంగా ఉండే ప్రాంతాల్లో దొంగతనం చేస్తూ ఉండేవాడు. కాగా ఇటీవల కూడా ఆ యువకుడు దేవిచౌక ప్రాంతంలో దొంగతనం చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఓ వృద్ధురాలి అటు నుంచి వెళ్తూ ఉంది. ఆ వృద్ధురాలి రాకను గమనించిన ఆ యువకుడు ఆమె మెడలో ఉన్నతాళిబొట్టును దొంగిలించాలనుకున్నాడు. ఇందు కోసం పక్కా ప్లాన్ తో ఎవరికి చిక్కకుండా ఆ మహిళ మెడలో తాళిబొట్టును దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు.
అయితే ఆ యువకుడు దొంగతనం చేస్తుండడంతో స్థానికంగా ఉండే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో వెంటనే స్పందించిన ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగతనం జరిగిన ప్రదేశంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎట్టకేలకు అందులో దొంగతనం చేస్తుండగా రికార్డ్ అయింది. దీంతో పోలీసులు దొంగతనానికి పాల్పడిన ఆ యువకుడి ఫొటోను తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే తన కుమారుడు దొంగతనం చేశాడంటూ వాట్సప్ గ్రూపుల్లో రావడం ఆ యువకుడి తల్లి చూసింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ మహిళ పోలీసులను సంప్రదించి ఎట్టకేలకు తన కుమారుడిని దగ్గరుండి పోలీసులకు పట్టించింది. అనంతరం ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆ తల్లి నేరుగా దొంగగ మారిన కుమారుడిని పోలీసులకు పట్టించడంతో పోలీసులు, స్థానికులు ఆ మహిళను మెచ్చుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.