కాలం మారుతున్న కొద్ది చెడుమార్గాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీంతో కొందరు టెక్నాలజీ సాయంతో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ముంబైలో ట్యూషన్ చెప్పేందుకు ఇంటికొచ్చిన మహిళా టీచర్ పై ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. టీచర్ బాత్ రూమ్ లో ఉండగా విద్యార్థి వీడియోలు తీస్తూ అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇది కూడా చదవండి: చికెన్ మంచిది ఇవ్వలేదని ఓనర్‌పై రాళ్లు, కర్రలతో ఎటాక్!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పుణెలో పదో తరగతి చదువుతున్న విద్యార్థికి పాఠాలు చెప్పిందుకే తన పేరెంట్స్ ఓ ట్యూషన్ మహిళ టీచర్‌ను ఎంపిక చేసుకున్నారు. అలా గత ఐదేళ్లుగా ఇంటికొచ్చి పాఠాలు చెబుతూ వస్తుంది. కాగా ఇటీవల ఆ విద్యార్థి టీచర్ పై వ్యామోహంతో ఏకంగా బాత్ రూమ్ లో సోప్ బాక్స్ లో మొబైల్ కెమెరా అమర్చి తరుచూ విడియోలు తీస్తున్నాడు. దీంతో ఇటీవల అది గమనించిన ఆ టీచర్ విద్యార్థి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.