వెబ్ సిరీస్ పేరిట మోడల్‌ను షూటింగ్‌కు పిలిచి, ఆమెతో బలవంతంగా అశ్లీల సినిమా తీశారు కొందరు వ్యక్తులు. ఆ వీడియోలను వివిధ పాడు సైట్లలో పెట్టి ఆమె పరువును బజారు కీడ్చారు. దీంతో సదరు మోడల్ పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 29 ఏళ్ల మోడల్ పలు బట్టల యాడ్స్‌లో నటించింది. మంచి అవకాశాల కోసం అన్వేషిస్తోంది. తన ఫోన్ నెంబర్, ఫొటోలు, ఇతర వివరాలను తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల్లో ఉంచింది. తనకు ఎవరైనా పిలిచి ఆఫర్లు ఇస్తారని భావించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం ఓ ఫోన్ వచ్చింది.
ఆ ఫోన్ చేసిన వ్యక్తులు వెబ్ సిరీస్‌లో అవకాశం ఇస్తామని అన్నారు. ఆమె వారిని నమ్మింది. వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లు బోల్డ్ సీన్ల పేరిట ఆమెతో అశ్లీల వీడియోలో నటింపజేశారు. ఆమె వద్దని వారించినా బలవంతంగా ఆ పని చేయించారు. లైంగికంగా కూడా వేధించారు. తర్వాత ఆ వీడియోలను ఇంటర్‌నెట్‌లో పెట్టారు. ఆ విషయం తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు పురుషులతో పాటు, ఓ మహిళకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం అన్వేషిస్తున్నారు.