మనిషి ప్రాణాలు ఏ క్షణంలో పోతాయో ఎవరూ చెప్పలేరు.. ఈ మద్య కాలంలో వరుసగా గుండెపోటు మరణాలు, రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిని వారు ఒక్కసారే లోకాన్ని వదిలిపోతున్నారు.
మనిషి ప్రాణాలు ఏ క్షణంలో పోతాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని పెద్దలు అంటారు. అప్పటి వరకు మన కళ్ల ముందు ఎంతో ఆనందంగా ఉన్నవారు.. అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ఓ ఫ్యాషన్ షో ఈవెంట్ లో అపశ్రుతి చోటు చేసుకొని మోడల్ మృతి చెందింది. ఈ ఘటన నోయిడాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
నోయిడా ఫిలింసిటీలోని లక్ష్మీ స్టూడియోలో ఫ్యాషన్ షో ఈవెంట్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందాల పోటీల్లో భాగంగా ర్యాంప్ వాక్ జరుగుతుండగా హఠాత్తుగా ఇనుప స్తంభం కూలి వంశీక చోప్రా(24) అనే యువ మోడల్ పై పడటంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. పక్కనే ఉన్న మరో యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.. వెంటనే అతనిని హాస్పిటల్ కి తరలించారు. స్టూడియోలో అహ్లాదకరంగా ఫ్యాషన్ షో సాగుతుంది.. అందాల పోటీ జరుగుతున్న సమయంలో అందరూ ర్యాంప్ వ్యాక్ చేస్తున్న మోడల్స్ పై దృష్టి పెట్టారు. వరుస క్రమంలో వస్తున్న వంశీక చోప్రా ర్యాంప్ పై నడక మొదలు పెట్టింది. లైట్ల కోసం పైన అమర్చిన ఇనుప స్తంభం అకస్మాత్తుగా కూలి నేరుగా వంశిక మీద పడటంతో తలకు తీవ్రంగా గాయమై అక్కడికక్కడే కన్నుమూసింది.
ఈ ఘటనలో బాబీ రాజ్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు తెలిపారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. కేసు విచారణ చేపట్టిన అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మోడల్ వంశిక చోప్రా, గాయపడిన బాబీ రాజ్ కుటుంబాలకు సమాచారం అందించామని.. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్ ను ఏర్పాటు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.