సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోయింది. కొంతమంది రక్త సంబంధీకులతోటే తప్పుగా ప్రవర్తిస్తున్నారు. సొంత బిడ్డలను చెరిచిన మృగాళ్లు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. తాజా ఘటనలో ఓ మహిళ హద్దులు మీరి ప్రవర్తించింది. అరవై ఏళ్ల వయసులో తప్పుడు పని చేసింది. సొంత అక్క కొడుకును ప్రేమించింది. అతడిని సొంతం చేసుకోవటానికి దారుణానికి తెగబడింది. అక్క కొడుకు పెళ్లిని ఆపేసింది. ఇందు కోసం ఓ దొంగ మ్యారేజ్ సర్టిఫికేట్‌ను సైతం సృష్టించింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు..
ఉత్తర ప్రదేశ్, మొహల్లా అంత గ్రామానికి చెందిన అసిఫ్ అనే వ్యక్తి బట్టల షాపు నడుపుతున్నాడు. అతడి చిన్నాన్న మార్చి 2, 2022న అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అతడి పిన్ని కన్ను అసిఫ్ ఆస్తిపై పడింది. తనను పెళ్లి చేసుకోమని చాలా రోజుల నుంచి అతడ్ని వేధిస్తూ ఉంది. ఈ పెళ్లికి అతడు ఒప్పుకోలేదు. దీంతో ఆమె కుటుంసభ్యులు అసిఫ్ ఇంట్లోకి చొరబడి నారా రచ్చ చేశారు. సంవత్సరం క్రితం అసిఫ్‌కు పెళ్లి కుదిరింది. డిసెంబర్ 28న ఆ పెళ్లి జరగాల్సి ఉండింది. పెళ్లి జరగటానికి ఐదు రోజుల ముందు అతడి పిన్ని ఓ దొంగ మ్యారేజ్ సర్టిఫికేట్ సృష్టించింది.
దాన్ని అసిఫ్‌కు కాబోయే అత్తింటి వారికి పంపింది. దీంతో అమ్మాయి తరపు వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. తనకు జరిగిన అన్యాయంపై అసిఫ్ పోలీసులను ఆశ్రయించారు. ఆస్తి కోసం సొంత పిన్ని దారుణంగా ఇబ్బందిపెడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మ్యారేజ్ సర్టిఫికేట్ విషయంలో కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఆ సర్టిఫికేట్‌పై అసిఫ్ సంతకం లేదని అసిఫ్ తరపు లాయర్ అంటున్నాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.