ఈ రోజుల్లో చాలా మంది వివాహబంధాని కంటే వివాహేతర సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీని కారణంగా తాళికట్టిన భార్యను కాదని ప్రియురాలితో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అచ్చం ఇలాగే వ్యవహిరించిన ఓ పెళ్లైన వ్యక్తి తన భార్య కంటే ప్రియురాలితో ఉండేందుకు ఇష్టపడ్డాడు. చివరికి ఆ వివాహితను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, ఆమె తిరస్కరించడంతో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది కర్ణాటకలోని చిక్కబళ్లాపురం పట్టణంలోని కోటే ప్రాంతం. ఇక్కడే నవీన్ (27) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. నవీన్ స్థానికంగా కార్పెంటర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా కొంత కాలం పాటు నవీన్ సంసారం బాగానే సాగింది. కానీ రోజులు గడిచే కొద్ది నవీన్ బుద్ది వక్రమార్గంలోకి వెళ్లింది. దీంతో పక్కింటి వివాహితను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా ప్రేమా, గీమా అంటూ ఆ వివాహితను విసిగించాడు. ఇంతటితో ఆగకుండా పక్కింటి వివాహిత పేరును తన చేతిపై పచ్చబొట్టుగా వేసుకున్నాడు. ఇక ఇదే కాకుండా ఆ వివాహిత భర్త ముందే ఆమెను ప్రేమించాలని వెంటపడ్డాడు. దీంతో అనేక సార్లు ఆ వివాహిత అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.
కానీ అవేవి పట్టించుకోని ఆ వ్యక్తి నువ్వు లేకుంటే నేను బతకలేను, చచ్చిపోతానంటూ బెదిరించాడు. ఇదిలా ఉంటే ఇటీవల మరోసారి నవీన్ తన ప్రియురాలికి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. ఆమె మరోసారి నో చెప్పడంతో నవీన్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఇటీవల ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ భార్య, అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పెళ్లైన వివాహితను ప్రేమిస్తునానని వెంటపడి, కాదంటే ఆత్యహత్య చేసుకున్న నవీన్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.