Last Love Letter: ‘‘ప్రేమ ఎంత మథురం.. ప్రియురాలు అంత కఠినం’’ అన్నాడో సినీ రచయిత. అవును! ప్రేమ దొరికిన వారికి మథురాను భూతుల్ని రుచి చూపిస్తుంది.. దొరకని వారిని కన్నీళ్లకు బలిచేస్తుంది. కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మనం ప్రేమించిన వాళ్లు మనల్ని ప్రేమించాలన్న రూలేమీ లేదు. గోపిరాజు ఈ నిజాన్ని గుర్తించలేకపోయాడు. ప్రేమించిన అమ్మాయే ప్రాణంగా బ్రతికాడు. ఆమె బలంగా వద్దుంటున్నా.. అతడు మాత్రం అంతకంటే బలంగా ఆమెను కావాలనుకున్నాడు.. రెండింటికి పొత్తు కుదరలేదు. ‘‘గురుతు చెరిపివేసి జీవించాలని, చెరపలేకపోతే మరణించాలని..’’ అన్న పాట చరణాన్ని నిజం చేశాడు. చివరకు ఆమెను మర్చిపోలేక ప్రాణాలు బలి చేసుకున్నాడు. చివరి ప్రేమ లేఖలో తన ప్రేమను అక్షరాల రూపంలో నింపి ఆమెకు అంకితం ఇచ్చాడు.
వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా, రొంపిచర్ల మండలం విప్పర్లకు చెందిన గోపిరాజు అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే, ఈ ప్రేమ ఆమెకు ఇష్టం లేకపోయింది. అతడు ఎంత వెంటబడ్డా ప్రయోజనం లేకపోయింది. ఛీత్కారాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాను ఎంత చేసినా.. ఎన్ని చేసినా.. ఆమె తనను ప్రేమించదని గోపిరాజు భావించాడు. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. ఆమెను మర్చిపోవాలంటే.. తాను చచ్చిపోవాలి అని డిసైడ్ అయ్యాడు. చివరి సారి ఆమె కోసం ఓ లేఖ రాశాడు. కవిత్వంతో తన బాధను రాసుకొచ్చాడు. ‘‘ ఏ అమ్మాయి.. నువ్వే గెలిచావు.. నేనే ఓడిపోయా.. నేను ఏ తప్పూ చేయలేదు.. నేను ఎప్పుడూ ఓడిపోలా..ఇప్పుడే ఓడిపోయా.. ఈ జన్మకు నువ్వే ఊహించుకున్నా నా భార్యగా కావాలని అనుకున్నా.. కానీ, నాకు అదృష్టం లేదు. అమ్మాయి నేను నిన్ను మరిచిపోలేకపోతున్నా. పిచ్చి పట్టినంతగా ఉంది.. అమ్మాయి నువ్వు అన్నావే.. నీకేమీ పిచ్చి పట్టిందని.. అవును అమ్మాయి నీ పిచ్చే పట్టింది.. ఆ పిచ్చిపోవాలంటే ఏమి చేయాలి.. నిన్ను మర్చి పోవాలంటే.. ఈ జన్మలో జరగదు. అమ్మాయి నేను నిన్ను మరిచిపోవాలంటే.. ముందు నేను చచ్చిపోవాలి……’’ అని తన ఆవేదనను రాశాడు. ఈ నెల 21వ తేదీన బోడిశంభునివారిపాలెం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రేమ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, గోపిరాజు విషాధ ప్రేమ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ram Gopal Varma: మరో వివాదంలో రామ్ గోపాల్ వర్మ! మోసం చేశాడంటూ కేసు నమోదు!