ఏపీలోని బాపట్లలో టెన్త్ క్లాస్ స్టూడెంట్ అమర్ నాథ్ అనే విద్యార్థిని కొందరు యువకులు పెట్రోల్ పోసి నిప్పించారు. ఇదే ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
బాపట్ల టెన్త్ క్లాస్ విద్యార్థి హత్య కేసు ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారుతోంది. వెంకటేశ్వర్ రెడ్డి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి విద్యార్థి అమర్ నాథ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ బాలుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే అతడు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఆ బాలుడిపై పెట్రోల్ పోసి ఎందుకు సజీవదహనం చేశారు? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి పరిధిలోని ఉప్పలవారిపాలెం గ్రామం. ఇక్కడే ఉప్పల అమర్ నాథ్ (14) అనే బాలుడు నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి గతంలోనే మరణించాడు. దీంతో అప్పటి నుంచి తల్లి, సోదరితో పాటు తాత ఇంటి వద్దే ఉండి చదువుకుంటున్నారు. అయితే, అమర్ నాథ్ స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉంటే, అమర్ నాథ్ అక్కను రాజోలు రెడ్లవారిపాలెనికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అమర్ నాథ్.. ఇటీవల వెంకటేశ్వర్ రెడ్డికి అతని స్నేహితుల ముందే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు అమర్ నాథ్ పై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అమర్ నాథ్ ను హత్య చేయాలని పథకం రచించాడు.
ఇందులో భాగంగానే వెంకటేశ్వర్ రెడ్డి గురువారం ఓ బాటిల్ లో పెట్రోల్ తెచ్చి పెట్టుకున్నాడు. ఇక అమర్ నాథ్ ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 6 గంటలకు రాజోలుకు సైకిల్ పై ట్యూషన్ వెళ్తున్నాడు. పక్కా ప్లాన్ తో వెళ్లిన వెంకటేశ్వర్ రెడ్డి.. సైకిల్ పై వచ్చిన అమర్ నాథ్ ను తన స్నేహితులతో కలిసి అడ్డగించాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ వడ్ల బస్తాల వెనకాలకు తీసుకెళ్లి అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతంర తెచ్చిపెట్టుకున్న పెట్రోల్ ను వెంకటేశ్వర్ రెడ్డి అమర్ నాథ్ ఒంటిపై పోసి నిప్పటించాడు. దీంతో ఆ బాలుడు పూర్తిగా ఆ మంటల్లో కాలిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేసి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే ఏం జరిగిందంటూ అమర్ నాథ్ ను ప్రశ్నించగా.. చిల్లర కొట్టు అబ్బాయి వెంకీ.. అతని స్నేహితులతో కలిసి నన్ను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత నాపై పెట్రోల్ పోసి నిప్పటించారు అంటూ చివరి మాటలు చెప్పి మార్గమధ్యలోనే కన్నమూశాడు. దీనిని వీడియో తీసుకుని వాట్సప్ లో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. కుమారుడి మరణవార్త తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై అమర్ నాథ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మరి కొందరు పరారీలో ఉన్న స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలకంగా మారుతోంది.