చినగంజాంలోని తిరునాళ్లకు వెళ్లి.. అక్కడి నుంచి అద్దంకికి కారులో వెళ్తున్న ఐదు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢికొట్టి.. ఆ తర్వాత కారును లారీ ఢికొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఈ ప్రమాదం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్‌లో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురిలో.. నలుగురు అద్దంకి ఎస్‌ఐ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. చినగంజాం నుంచి అద్దంకి వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి.. రోడ్డుకు అటువైపు దూసుకెళ్లింది. అదే సమయానికి అటుగా వస్తున లారీ కారును వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు అద్దంకి ఎస్‌ఐ సుందర్ వలీ కుటుంబసభ్యులు నలుగురు ఉండగా.. డ్రైవర్ కూడా మృతి చెందాడు. మృతులను అయేషా, గుర్రాల జయశ్రీ, గుర్రాల దివ్య, కొండమీది వీరబ్రహ్మచారిగా గుర్తించారు.
గుంటూరులో ఉన్న ఎస్ సుందర్ కుటుంబ సభ్యులు చినగంజాంలో జరుగుతున్న శివరాత్రి తిరునాళ్లకు చూసేందుకు వచ్చి.. తిరుగు ప్రయాణంలో వారిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. గుంటూరు నుంచి చినగంజాంలోని తిరునాళ్ల చూసి దర్శనం తర్వాత శనివారం రాత్రి కారులో అద్దంకిలో ఉన్న ఎస్‌ఐ సుందర వలీ నివాసానికి బయలుదేరారు. అర్ధరాత్రి సమయంలో కారు అదుపుతప్పి తొలుత డివైడర్ ఢీకొట్టి.. రోడ్డుకు అటుపక్కకి దూసుకెళ్లడంతో లారీ ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి మృతి చెందారు. వీరిలో ఎస్‌ఐ సుందర్ వలీ భార్య, కూతురితో పాటు గుంటూరులో వీరి ఇంటి పక్కన ఉండే ఇద్దరు మహిళలతో పాటు డ్రైవర్ ఉన్నారు. రోడ్డు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దంకి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను ఇంకా వెల్లడించలేదు.
బాపట్లలో ఘోర రోడు ప్రమాదం, ఐదుగురి మృతి. మృతుల్లో అద్దంకి ఎస్‌ఐ సుందర్ వలీ భార్య, కూతురు. గుంటూరు నుంచి చినగంజాం తిరునాళ్లకు వెళ్లి.. అక్కడి నుంచి అద్దంకి వెళ్తుండగా మార్గమధ్యలో కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.#Bapatla #roadaccident #Addanki #SumanTV
— SumanTV (@SumanTvOfficial) February 19, 2023