ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న జరిగిన ఒడిశా రైలు ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుండి తేరుకోక ముందే మరో తప్పిదం చోటుచేసుకుంటుండగా కీ మ్యాన్ గుర్తింపుతో పెను ప్రమాదం తప్పింది.
ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న జరిగిన ఒడిశా రైలు ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుండి తేరుకోక ముందే మరో తప్పిదం చోటుచేసుకుంటుండగా కీ మ్యాన్ గుర్తింపుతో పెను ప్రమాదం తప్పింది. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో రైల్వే పట్టా విరిగిపోయింది. పట్టా విరిగిన సమాచారం తెలిసి అధికారులు అప్రమత్తతతో వ్యవహరించారు. మరమ్మతుల అనంతరం రైళ్లను కొనసాగించారు. దీంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామ సమీపంలో రైల్వే స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. దీనిని కీ మ్యన్ గుర్తించారు. ఈపూరుపాలెం దరదాపుల్లోకి వచ్చేసరికి రైలు పట్టా విరగడాన్ని కీ మ్యాన్ గమనించారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు గురువారం ఉదయం బెంగళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. పలు స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. యథావిధిగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో దాదాపు అరగంట సేపు ఇతర ట్రైన్లు ఆలస్యంగా బయలుదేరాయి. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.