వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చాలా మంది హార్ట్ ఎటాక్ తో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న మెదక్ లో నాగరాజు, నేడు ఖమ్మంకు చెందిన చౌదా రెడ్డి, తాజాగా ఆదిలాబాద్ కు శివ కుమార్ గుండెపోటుతో చనిపోయారు.
గుండెపోటు మరణాలు రోజు రోజుకు ఎక్కవవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చాలా మంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. నిన్న మెదక్ జిల్లాకు చెందిన నాగరాజు, నేడు ఖమ్మం జిల్లాకు చెందిన చౌదా రెడ్డి గుండెపోటుతో మరణించారు. అయితే ఈ వరుస గుండెపోటు మరణాలు మరువక ముందే తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ కార్మికుడు గల్ఫ్ లో హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతకుంట గ్రామంలో నరేంద్రుల శివ కమార్ (42) – శోభ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే శివ కుమార్ ది నిరుపేద కుటుంబం కావడంతో నాలుగేళ్ల కిందటే బతుకు దెరువు కోసం గల్ఫ్ కు వెళ్లాడు. శివ కుమార్ అప్పటి నుంచి అక్కడే కూలీ పనిగా చేస్తూ పైసా పైసా కూడబెడుతున్నాడు.
ఇదిలా ఉంటే.. బుధవారం ఉన్నట్టుండి శివ కుమార్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే స్పందించిన స్థానికులు.. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, మార్గమధ్యలోనే శివ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. అక్కడి అధికారులు ఇదే విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య, కుమారులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. శివ కుమార్ మరణంతో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పొట్టకూటి కోసం మరో దేశానికి వెళ్లి చివరికి శవమై తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు.