నేటి కాలంలో కొందరు వ్యక్తులు బాబా ముసుగు తోడిగి దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని ఆర్థికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. మరీ ముఖ్యంగా మూడ నమ్మకాలకు బలైన కొందరు మహిళలు స్వామిజీల వలలో చిక్కుకుని నిండా మోసపోతున్నారు. ఇలాగే నమ్మించిన ఓ స్వామిజీ పిల్లలను ప్రసాదిస్తానంటూ ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలోని ఓ వ్యక్తి స్వామి వైర్యాగ్యనందగిరిగా తనకు తానే స్వామిజీనంటూ ప్రజలను నమ్మిస్తున్నాడు. ఇలా ఎంతో మంది అమాయకులు అతని మాయలో పడి అతని దర్శనం కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో పాటు సంతానం లేని మహిళలకు పిల్లలు కలిగేలా చేస్తానంటూ మాయమాటల చెప్తూ మహిళలను లోబరుచుకుంటున్నారు. ఇతని వలలో చిక్కుకున్న అనేక మందిని శారీరకంగా, ఆర్థికంగా హింసిస్తున్నాడు. ఇదంతా నిజమేనేమోనని నమ్మిన ఓ మహిళ సంతానం కోసం ఆ స్వామిజీ వద్దకు వెళ్లింది. ఆమె అందాన్ని చూసి ఆకర్శితుడైన ఈ మాయగాడు ఎలాగైన లోబరుచుకోవాలని ప్లాన్ వేశాడు.
ఇందులో భాగంగానే ప్రత్యేక పూజల పేరుతో ఆ మహిళకు మత్తు పదార్థం నోట్లో పోశాడు. అది తాగిన మహిళ మత్తులోకి జారుకుని పూర్తిగా స్పృహ కోల్పోయింది. వెంటనే అలెర్ట్ అయిన ఈ కేటుగాడు ఆ మహిళను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. స్పృహ నుంచి బయటకు రాగానే ఆ మహిళ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని గ్రహించింది. వెంటనే ఏం జరిగిందంటూ స్వామిజీని నిలదీసింది. నీకు పిల్లల కలగడానికి ఆ స్వామిజీయే వచ్చి ఇదంతా చేశాడంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ మాయగాడి మాటలు నమ్మని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇలా ఎంతో మంది కేటుగాళ్లు స్వామిజీ ముసుగు తొడిగి దారుణాలుకు పాల్పడుతూ ఇటు అర్థికంగా, అటు శారీరకంగా హింసిస్తున్నారు. తాజాగా పిల్లలు ప్రసాదిస్తానని చెప్పి అత్యాచారం చేసిన ఈ కేటుగాడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.