ఇతనికి ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. ఎలాగైన నా ప్రేమను వివరించాలనుకున్నాడు. అయితే ఇటీవల ఆ యువతకి తన విషయం తెలిపాడు. కానీ, ఆ తర్వాత జరిగిందేంటంటే?
చదువుకునే రోజుల్లో ఇతనికి ఓ అమ్మాయి పరిచయం అయింది. దీంతో తొలిచూపులోనే ఆ యువతిపై మనసుపడ్డాడు. రోజు రోజుకు ఆ అమ్మాయిపై అతడికి ఇష్టం పెరిగిపోయింది. ఎలాగైన నా ప్రేమను తెలియజేసి.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఆ యువకుడు ఇటీవల తన ప్రేమను యువతికి చెప్పాడు. ఆ తర్వాత అతడు అసలు నిజం తెలుసుకుని షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా టంకర గ్రామంలో ప్రవీణ్ కుమార్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి కృష్ణాజీ గతంలోనే మరణించాడు. దీంతో ఆ యువకుడు అప్పటి నుంచి తల్లి రమాదేవిని చూసుకుంటూ చదువుకున్నాడు. అయితే డీఈడీ చదువుతున్న రోజుల్లో ఇతనికి నారాయణపేట జిల్లాకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ప్రవీణ్ కుమార్ ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాడు.
కొన్నాళ్లపాటు ఆ యువతికి చెప్పకుండా తనలో తాను సంతోషపడ్డాడు. అయితే ఇటీవల ఎలాగో ధైర్యం చేసి.. తన ప్రేమ విషయాన్ని ఆ యువతితో తెలిపాడు. ప్రవీణ్ కుమార్ మాటలు విన్న ఆ యువతికి ఒక్కసారిగా షాక్ కు గురైంది. నాకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని, నన్ను మర్చిపో అని తెలిపినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ప్రేమించిన అమ్మాయి లేకుండా నేను బతకలేను. నేను చనిపోయిన తర్వాత నా కళ్లను దానం చేయాలంటూ.. సెల్పీ వీడియో తీసుకుని ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించిన యువతి దక్కలేదని ఆత్మహత్య చేసుకున్న ఈ యువకుడి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.