నేటి కాలం యువత పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కన్నా.. ప్రేమ పెళ్లిళ్లకే మొగ్గు చూపుతున్నారు. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా సరే.. ఎదురించి మరి చివరికి లవ్ మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. ఇక చేసుకున్నాక సంతోషంగా ఉంటున్నారా అంటే.. అదీ లేదు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడడం, క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భర్త.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా భార్యపై దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
తమిళనాడు మధురైలోని ఓ ప్రాంతంలో వర్ష (18), పళని (25) ఇద్దరు భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరు 6 నెలల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగా ఉన్నారు. అలా మూడు నెలల గడిచిందో లేదో… సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో ఒక్కసారిగా గొడవలు చెలరేగాయి. దీంతో భర్త తీరు నచ్చని భార్య.. పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే కొన్నిరోజులు పాటు ఉంది. అయితే భర్త మాత్రం.. ఇంటికి రావాలంటూ భార్యకు అనేకసార్లు ఫోన్ చేశాడు. కానీ, వర్ష అతని మాట వినకపోవడమే కాకుండా, అతని వద్దకు రావడానికి ఇష్టపడలేదు. దీంతో పళని కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అయితే ఈ క్రమంలోనే పళని శుక్రవారం భార్య వద్దకి వెళ్లాడు.
హెల్మెంట్ ధరించుకుని వెళ్లిన పళని.. భార్య వర్ష రోడ్డు మీదకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాడు. భార్య వర్ష రానే వచ్చింది. ఇక భర్త పళని దొంగచాటున హెల్మెంట్ ధరించి భార్యను నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దారుణంపై వర్ష తల్లిదండ్రులు స్పందించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో వర్ష ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.