Tirupati: ప్రేమకు రెండు మనసులు కలిస్తే చాలు. కానీ, పెళ్లికి రెండు కుటుంబాలు కలవాలి. కులాంతర, మతాంతర వివాహాలకు చాలా కుటుంబాలు వ్యతిరేకం. తమకు ఇష్టం లేని పెళ్లి ఎవర్ని చేసుకున్నా పెద్దలు సహించలేరు. ఇక, ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయి పెద్దల పంతాలకు బలై జీవించటం ఇష్టం లేక తమ దారి చూసుకుంటున్నారు. ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకుంటున్నారు. తాజాగా, ఓ ప్రేమ జంట ఇంటినుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలం మల్లయ్యగారి పల్లికి చెందిన పవన్, అదే గ్రామానికి చెందిన నీరజ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. అయితే, ఇద్దరి కులాలు వేరు కావటంతో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో పవన్, నీరజ ఓ నిర్ణయానికి వచ్చారు. ఇంటినుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే బెంగళూరు వెళ్లి, అక్కడ పెళ్లి చేసుకున్నారు. నీరజ ఇంట్లో కనిపించకపోవటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు పెట్టారు. తాజాగా, తమకు రక్షణ కల్పించాలంటూ పవన్, నీరజల జంట తిరుపతి ఎస్పీని ఆశ్రయించింది. తన తల్లిదండ్రులనుంచి ప్రాణ ఉందని నీరజ ఫిర్యాదు చేసింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అందంతో నగల వ్యాపారికే మస్కా కొట్టింది.. బలవంతంగా హోటల్ కు తీసుకెళ్లి!