నేటి ఆధునిక సమాజంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ.. మనిషి మెదడు మాత్రం మారడం లేదు. దేశంలో ఎక్కడో ఒకచోట ప్రతీరోజు స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. స్నేహితులు, బంధువులు చివరికి కన్న తండ్రులే పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు.. సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని వరంగల్ లో ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన కన్నీరు తెప్పిస్తోంది. తొలుత ప్రేమ ప్రేమపేరిట బాలికకు గాలం వేసిన యువకుడు.. కొంత కాలంగా తన కోరికలను తీర్చుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ రోజు మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేద కుటుంబానికి చెందిన మహిళ.. భర్తను కోల్పోవడంతో సొంత ఊరును వదిలి ఇద్దరు కుమార్తెలతో కలిసి వరంగల్ లోని కాశిబుగ్గకు వలస వచ్చారు. అక్కడే కూలీ పనులకు వెలుతూ.. కుమార్తెలను చదివిస్తోంది. పెద్ద కుమార్తె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా, చిన్న కూతురు ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే చిన్న కూతురుకు తన కాలేజీలో చదివే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు దూడల ప్రభాస్ (22) అనే యువకుడు. అతడిది నర్సంపేట సమీపంలోని మాదన్నపేట గ్రామం. ఆ బాలికతో పరిచయం పెంచుకున్న ప్రభాస్ ప్రేమిస్తున్నానంటూ.. నమ్మించాడు. పెళ్లి కూడా చేసుకుంటాను అని మాటలు చెప్పాడు. అతడి మాటల నమ్మిన బాలికను పలుమార్లు మదన్నపేటకు రప్పించుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మాట్లాడుకుందాం రమ్మని బాలికను తన ఊరుకు రప్పించుకున్నాడు. ఇంట్లో బంధువులు ఉన్నారని చెప్పి ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు. దాంతో ప్రభాస్ స్నేహితులు అయిన భరత్, బన్నీలు ఖిలా వరంగల్ శివార్లలో నిర్మానుష్య ప్రాంతాలు ఉంటాయి, అక్కడి వెళ్లమని సలహా ఇచ్చారు. అయితే పథకం ప్రకారంమే ప్రభాస్ సహాయంతో.. ఆ బాలికతో ఎంజాయ్ చెయ్యాలని భావించారు భరత్, బన్నీలు. అందుకే వారు ఆ ప్రాంతానికి వెళ్లాలని ముందుగానే సూచించారు. దాంతో ప్రభాస్ ఆ బాలికను ఎక్కించుకుని ఖిలా వరంగల్ వెళ్లాడు. అనంతరం వారిని వెంటాడుతూనే అక్కడికి చేరుకున్నారు భరత్, బన్నీ, మరో వ్యక్తి. ముందుగా అనుకున్నట్లుగానే ప్రభాస్ ను, బాలికను బెదిరిస్తున్నట్లుగా నటిస్తూ.. ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారు. అనంతరం బాలికపై భరత్, బన్నీలు అత్యాచారం చేశారు. ‘కాళ్లు మెుక్కుతా నన్ను వదలండి’ అని కన్నీరు కారుస్తూ.. ప్రాధేయపడినప్పటికీ కూడా వారు వినకుండా అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అటువైపు ఎవరూ రాకుండా మరో యువకుడు వారికి కాపాలాగా ఉన్నాడు.
ఈ ఘటనతో బాలిక షాక్ లోకి వెళ్లి స్పృహ కోల్పోయింది. ఆమె తిరిగి లేచే వరకు అక్కడే ఉన్న ప్రభాస్.. ఈ విషయం తల్లికి చెప్తుందేమో అన్న భయంతో, తన భావ అనీల్ ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక తనపై జరిగిన దారుణాన్ని అనీల్ కు చెప్పడంతో ఆమెను ఇంటికి పంపించాడు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది ఆ బాలిక. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక తల్లి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులతో పాటుగా వీరికి సహకరించిన మరో వ్యక్తిపై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.