ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో కోర్టు ఆవరణలో కలకలం రేగింది. కూతురిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు బీఎస్ఎఫ్ మాజీ సైనికుడు. చనిపోయిన వ్యక్తిని బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన దిల్షాద్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. మాజీ జవాను తన కుటుంబంతో కలిసి పట్నాఘాట్ తిరాహే సమీపంలో ఉన్న ఇంట్లో నివసించేవాడు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా విధిపురాకు చెందిన దిల్షాద్ హుస్సేన్ జవాను ఇంటి ముందు పంక్చర్ దుకాణం నడిపేవాడు. అయితే 12 ఫిబ్రవరి 2020న, దిల్షాద్.. జవాన్ మైనర్ కుమార్తెను కిడ్నాప్ చేశాడు. ఈ విషయంపై 17 ఫిబ్రవరి 2020న, దిల్షాద్‌పై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి : ముంబైలో గలీజు దందా! డేటింగ్ యాప్ పేరుతో..
ఈ కేసు నుంచి రెండు నెలల క్రితం బెయిల్‌పై విడుదలయిన దిల్షాద్ కేసు విచారణ నిమిత్తం హాజరయ్యేందుకు కోర్టు గేటు వద్దకు చేరుకున్నాడు. అప్పుడే భగవత్ నిషాద్ అనే బీఎస్ఎఫ్ మాజీ జవాన్ దిల్షాద్ను కాల్చి చంపాడు. తన కూతురిపై అత్యాచారం చేశాడన్న కోపంతోనే నిషాద్.. దిల్షాద్ను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. భగవత్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.