మనిషి జీవితంలో ప్రేమను కోరుకోని వారూ ఎవ్వరూ ఉండరు. కానీ ప్రస్తుత కాలంలో ప్రేమ అనేది తమకు మాత్రమే చెందినదిగా యువత భావిస్తున్నారు. ప్రపోజల్ చేసుకోవడం..ఇష్ట పడిన వ్యక్తులు ఓకే చెప్పగానే అదే ప్రేమనుకుని తమకే తెలియని ఊహా లోకంలో విహరించడం ప్రస్తుత సమాజాన జరుగుతోంది. కానీ మోసపోయామని తెలిశాక మనస్థాపం చెందడంతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేటి యువత. క్షణికావేశంలో చేసే కొన్ని పిచ్చి పనులు వారి జీవితాలకూ శాపంగా మారుతుంది. తాను ప్రేమించిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకోలేదని భావించిన యువతి అతడికి బుద్ధి చెప్పే క్రమంలో చిక్కులు తెచ్చుకుంది.
ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెరంబలూరు జిల్లాకు చెందిన 21 ఏళ్ల మహిళ ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ చెన్నైలోని సైదా పేటలో ఉంటుంది . శనివారం రాత్రి తనను చెంగల్ పట్టు రైల్వేస్టేషన్ లో నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, కారులో ఎక్కించుకుని కాంచీపురంలోని సాలవాక్కం సమీపంలోని అటవీ ప్రాంతాలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులకు ఫోన్ చేసింది. రైల్వే స్టేషన్ కు ఎందుకు వెళ్లావని అడగ్గా.. తన ఫ్రెండ్ పిలిస్తే వెళ్లాలని చెప్పింది. అయితే పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.చెంగల్ పట్టు రైల్వే స్టేషన్, చుట్టు ప్రక్కల ఉన్నసిసిటివి ఫుటేజ్ లను పరిశీలించగా, సదరు మహిళ, ఓ వ్యక్తితో కలిసి మోటారు వాహనంపై వెళ్లినట్లు గుర్తించారు.
ఆరా తీయగా.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. సలీమ్, ఆమె కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలని పలుమార్లు సలీమ్ ను కోరగా, అతడు నిరాకరిస్తూ వస్తున్నాడు. శనివారం రాత్రి కూడా ఏకాంత ప్రాంతానికి వీరిద్దరూ వెళ్లారు. పెళ్లి చేసుకోవాలని సలీమ్ ను కోరగా.. అతడు నిరాకరించడంతో పాటు ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె అరవడం ప్రారంభించింది. ఈ ఘటనతో విస్తుపోయిన సలీమ్ అక్కడి నుండి పారిపోయాడు. అనంతరం పోలీసులకు తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా.. ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవడం లేదన్న అక్కసుతో కిడ్నాప్, సామూహిక అత్యాచారం డ్రామా ఆడిందని తెలిసి వారు కూడా విస్తుపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ప్రియుడిపై కోపంతో ప్రియురాలు చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.