ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల్లో తలదూర్చిన కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలను కొనసాగిస్తూ చివరికి హత్య గురవుతున్నారు. అచ్చం ఇలానే మహిళతో వివాహేత సంబంధం కొనసాగించిన ఓ వ్యక్తి ప్రాణం గాలిలో కలిసిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం సున్నపు రాళ్ల తండాకు చెందిన బానోత్ లక్ పతి(35)కి భార్య నీల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ పతి మానుకోటలోని మిలటరీ కాలనీలో నివాసం ఉంటూ గొర్రెల వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో భాగంగా గురువారం ఉదయం లక్ పతి కి ఫోన్ కాల్ రాగానే ఇంట్లో నుంచి ద్విచక్రవాహనం పై బయలుదేరాడు. నందినగర్ కాలనీ లో గల చెరువుకట్ట సమీపంలోకి చేరుకున్నాక కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అకారణంగా అతనితో ఘర్షణకు దిగారు. క్రమంలో లక్ పతి కళ్లలో కారంపొడి చల్లి, ఇనుప రాడ్డుతో తలపై, శరీరంపై బలంగా కొట్టి చంపేశారు. అనంతరం అతడి ముఖంపై దుప్పటి కప్పి అక్కడి నుంచి పరారయ్యారు.
ఇది కూడా చదవండి : ముంబైలో గలీజు దందా! డేటింగ్ యాప్ పేరుతో..
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంకి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా అతడు తండాకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని, అదే విషయంలో పలుమార్లు పంచాయతీలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. దానివల్లనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుడి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.