దేశంలో సభ్య సమాజం సిగ్గు పడే రీతిలో సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా గానీ మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వెలుగు చూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ASP ప్రదీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 16ఏళ్ల బాలిక తన తండ్రి తో కలిసి ముంబైలో ఉంటోంది. కొన్ని రోజుల క్రితం జబల్ పూర్ లోని తన పెదనాన్న ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే తనకు వరుసకు సోదరులు అయ్యే ఇద్దరితో ఆ బాలిక చాలా సరదాగా ఉండేది. ఇదే అదునుగా బావించిన ఆ మృగాళ్లు ఆ బాలిక పై లెైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెప్పితే చంపేస్తామని బెదిరించి పలు మార్లు అత్యాచారం చేశారు.
ఈ క్రమంలోనే తీవ్రంగా ఆ బాలికను కొట్టడంతో కుటుంబ సభ్యులు తనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ బాలిక చికిత్స పొందుతూ ఇటీవల మరణించింది. అయితే తన కూతురు ఇద్దరు సోదరులు రేపు చేసి కొట్టడంతోనే మరణించిందని, అదీకాక వారిని ఆపేందుకు వెళ్లిన తన తల్లిపైనా అత్యాచారం చేశారని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏఎస్పీ తెలిపాడు.
ఇక ఆ బాలికకు శవ పరీక్షలు నిర్వహించామని, బాలిక బామ్మకు సైతం పరీక్షలు చేయగా అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. దీంతో సోదరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరి ఈ అమానవీయ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.