Late Night Party: లేట్ నైట్ పార్టీల కల్చర్ రోజురోజుకూ పెరుగుతూపోతోంది. అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా లేకుండా అందరూ లేట్ నైట్ పార్టీల్లో పాల్గొనటం మామూలైపోయింది. ఈ నేపథ్యంలోనే గొడవలు, అత్యాచారాలు, అమానవీయ ఘటనలు కూడా మామూలైపోయాయి. తాజాగా, ఓ లేట్ నైట్ పార్టీలో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ సంఘటన ఛత్తీష్‌ఘర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛత్తీష్‌ఘర్ రాయ్‌పూర్‌లోని వీఐపీ రోడ్‌లో ఉన్న ఓ హోటల్‌లో కొద్దిరోజుల క్రితం ఓ లేట్ నైట్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి అబ్బాయిలతో పాటు కొంతమంది అమ్మాయిలు కూడా హాజరయ్యారు. అర్థరాత్రి పార్టీ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చారు. హోటల్ బయట నిల్చుని ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే అమ్మాయిలు, అబ్బాయిల గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. మొదట అరుపులతో మొదలైన గొడవ తన్నుకునే వరకు పోయింది. రెండు గ్రూపులు కలబడి కుమ్ముకున్నాయి. ఈ దాడిలో రెండు గ్రూపుల వారు గాయపడ్డారు. స్థానికులు ఆ గొడవపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గొడవపడుతున్న వారంతా అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తెలిబంధా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సదరు నిందితులు ఎవరనేది తెలియరాలేదు. వీడియో ఆధారంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోనున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— K I N G (@KingKalyanPK) June 8, 2022
ఇవి కూడా చదవండి : దారుణం.. భార్యకు గవర్నమెంట్ జాబ్.. విడిచి వెళ్తుందన్న అనుమానంతో చెయ్యి నరికేసిన భర్త!