గీత తన భర్తను ఏటీఎం నుంచి డబ్బులు తీసుకురమ్మని బయటకు పంపింది. భర్త డబ్బులు తీసుకు రావటానికి బయటకు వెళ్లాడు. డబ్బులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి లోపల దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు.
ఊరికే ఉన్న జీవితానికి ఉరి బాధ అని తెలుగులో ఓ సామెత ఉంది. నూటికి 70 శాతం మంది జీవితాల్లో పెళ్లి ఓ ఉరి బాధలాగా తయారైంది. పెళ్లి చేసుకుని ఒక్కటైన భార్యాభర్తల మధ్య సంసార జీవితం సజావుగా సాగటం లేదన్నది సర్వేల్లో తేలిన విషయం. భార్య వల్ల భర్తకో.. భర్త వల్ల భార్యకో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కష్టాలు తప్పటం లేదు. ఆ కష్టాలు తీరని వ్యధలాగా మారి ప్రాణాలు తీసుకుంటున్న వారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. నిత్యం ఏదో ఒక చోట ఆత్మహత్యలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. చదువురాని వారి దగ్గరినుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. తాజాగా, ఓ మహిళా కానిస్టేబుల్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భర్తను ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసుకురమ్మని పంపించి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని మైసూర్ కు చెందిన గీతా అనే 32 ఏళ్ల మహిళ.. పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. నజరబాద్‌లోని పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోంది. కేఎస్‌ఆర్‌పీలోని వసతిగృహంలో భర్తతో కలిసి నివసిస్తోంది. ఫిబ్రవరి 19న ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆమె స్టేషన్‌నుంచి మధ్యాహ్నమే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత భర్తను ఏటీఎంనుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పి బయటకు పంపింది. భర్త ఆమెను ఇంటినుంచి బయటకు వెళ్లాడు. ఏటీఎంనుంచి డబ్బులు డ్రా చేసిన తర్వాత భార్యకు ఫోన్ చేశాడు.
అయితే, భార్య ఫోన్ రింగ్ అవుతున్నా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఇంటికి వెళ్లాడు. ఇంటి లోపలికి వెళ్లగానే ఊహించని దృశ్యం కనిపించింది. భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు గీత ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గీత ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.