Kurnool Man : మతిస్థిమితం లేని యువతితో పెళ్లి చేశారని ఆరోపిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణంగా కొందరి పేర్లను పేర్కొంటూ ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఈ సంఘటన గురువారం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు ముదిరాజ్ నగర్‌కు చెందిన హుస్సేన్ బాషాకు, గ్రాయాత్రి ఎస్టేట్‌కు చెందిన షాహీన్‌బీతో ఐదు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగిన తర్వాత వారం రోజులనుంచి ఇరు కుటుంబాలు గొడవలుపడ్డం మొదలైంది. పెద్దలు పంచాయతీ చేసి ఇరు కుటుంబాలను రాజీ చేశారు. అయితే, షాహీన్ మళ్లీ భర్తతో గొడవపడి మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. తాజాగా, దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు హుస్సేన్ భాషాను కౌన్సిలింగ్‌కు పిలిపించారు. దీంతో హుస్సేన్ బాషా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం అర్థరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున ఉరికి వేళాడుతున్న కుమారుడ్ని గుర్తించాడు తండ్రి. ఉరినుంచి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంట్లో ఓ సూసైడ్ నోట్‌ను కుటుంబసభ్యులు గుర్తించారు. తన చావుకు భార్య తరపు బంధువులే కారణమని హుస్సేన్ భాషా సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రేమ వ్యవహారం.. పెళ్లి చేసుకోమంటే వాయిదాలు.. తట్టుకోలేక..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.