జీవితంలో గొప్పగా స్థిరపడాలనుకుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కలల కనింది. దీని కోసం చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా రాణిస్తూ పలువురి ప్రశంసలు సైతం పొందింది. ఆమె తల్లిదండ్రులు కూడా కూతురుని బాగా చదివించారు. ఇక మా కూతురు జీవితంలో మంచి హోదాలో స్థిరపడుతుందని కూడా ఆశపడ్డారు. కానీ ఇటీవల ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసుకుని ఊహించని నిర్ణయం తీసుకుంది. దీంతో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామం. ఇక్కడే మోనాజీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి సువర్ణ (16) అనే కూతురు జన్మించింది. పుట్టిన కూతురుని అల్లారు ముద్దుగా చూసుకుంటూ మంచి స్కూల్లో చదివించారు. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని తమకు మంచి పేరును తీసుకొస్తుందని తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. కూతురు కూడా చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా రాణిస్తూ పలువరురి నుంచి ప్రశంసలు సైతం పొందింది. ఇదిలా ఉంటే సువర్ణకు గత కొంత కాలం నుంచి కడుపు నొప్పి రావడం మొదలైంది. దీంతో సువర్ణ తల్లిదండ్రులు అనేక ఆస్సత్రుల చుట్టు చెప్పుల తిరిగేల తిరిగి చికిత్స చేయించారు.
కానీ ఆ బాలికకు కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. అయితే సువర్ఱకు ఇటీవల మరోసారి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో సువర్ణ ఆ నొప్పిని తట్టులేకపోయింది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని టైమ్ చేసుకుని ఆ బాలిక పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ తాజాగా ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.