ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల్లో వేలు పెట్టి నిండు సంసారాలను ఆగం చేసుకుంటున్నారు. ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. చివరికి తన ఎఫైర్ కు భర్త అడ్డుగా ఉన్నాడని కొందరు మహిళలు భర్తను చంపటానికి కూడా వెనకాడటం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య భర్తను దారుణంగా హత్య చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామం.
ఇదే గ్రామంలో దావా కనకరాజు, విజయ ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంత కాలం భర్తతో సాఫీగా సాగిన వీరి జీవితంలో భార్య కొన్నాళ్లకి పక్కచూపులు చూసింది. ఏకంగా ఊళ్లో ఉండే వాటర్ మ్యాన్ తో ఎఫైర్ పెట్టుకున్న విజయ అతనితో సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. కొన్నాళ్లకి ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ఇలా కాదని భావించిన భార్య ఎలాగైన భర్తను అడ్డుతొలగించాలని భావించి మద్యంలో కుక్కల మంది కలిపి తాగింపించింది.
ఇది కూడా చదవండి: టీచర్‌పై వ్యామోహం.. బాత్ రూమ్‌లో ఉండగా వీడియోలు తీసిన విద్యార్థి!
ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కనకరాజు మరణించాడు. అనుమానం వచ్చిన కనకరాజు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. భార్యే భర్తకు కుక్కల మందు పెట్టి చంపిందని తెలిసింది. ఇక విజయతో వాటర్ మ్యాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.