ఫ్రెండ్ తో పడుకోవాలంటూ భార్యను టార్చర్ పెట్టిన భర్త. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. తరుచు ఇదే రాగాన్ని ఎత్తుకుని భార్యను తీవ్ర హింసకు గురి చేశాడు. ఓ రోజు ఎవరూ లేని టైమ్ లో ఆ మహిళ భర్త ఏం చేశాడంటే?
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే ఉంది. ఇక కొన్నాళ్లకి వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అలా చాలా ఏళ్లు ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే, రాను రాను ఆ మహిళ భర్త రాక్షసుడిలా మారాడు. కట్టుకున్న పెళ్లాం అని కూడా చూడకుండా పరాయి మగాడితో పడుకోవాలంటూ టార్చర్ పెట్టాడు. అంతేకాకుండా ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఏం చేశాడో తెలుసా?
పోలీసుల కథనం ప్రకారం.. కేరళలోని కొట్టాయంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం తర్వాత ఇద్దరు పిల్లలు జన్మించారు. వివాహం జరిగిన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. అయితే, రాను రాను ఆమె భర్త రాక్షసుడిలా మారాడు. తాళికట్టిన భార్య అని మరిచి దారుణానికి పాల్పడ్డాడు. నా స్నేహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ టార్చర్ చేసేవాడు. రోజులు గడుస్తున్న కొద్ది భర్త వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇక చేసేదేం లేక ఆ మహిళ భర్తపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
కొన్నాళ్ల తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. జైల్లో చిప్పకూడు తిన్నా.. అతని తీరు మాత్రం మారలేదు. కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ వద్ద పడుకోవాలంటూ మళ్లీ అదే రాగాన్ని ఎత్తుకున్నాడు. దీనికి భార్య నిరాకరించడంతో కోపంతో ఊగిపోయాడు. అయితే ఇటీవల ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. స్నేహితులతో పడుకోలేదని భార్యను హత్య చేసిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.