నేటి కాలంలో కొంతమంది మహిళలు భర్తను కాదని పరాయి మగాళ్ల మోజులో పడుతున్నారు. ప్రేమ పేరుతో భర్తను పక్కనబెట్టి ప్రియుడే కావాలంటూ ఎగేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. తీరా తన అవసరం తీరాక కాదు పొమ్మని బోర్డు తగలేసి ప్రియుడిని మోసం చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ పెళ్లైన మహిళ ప్రేమ పేరుతో నమ్మించి ప్రియుడిని దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని యాదగిరి ప్రాంతానికి చెందిన సిద్దార్థ(30) అనే యువకుడు తన వద్ద నున్న రెండు సొంత కార్లతో బెంగుళూరు నగరానికి చేరాడు.
అక్కడే నివాసం ఉంటూ ట్యాక్సీ డ్రైవర్ గా పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే సిద్దార్థ ఉండే ఇంటి పక్కనే కడెచూరుకు చెందిన శ్రీదేవి(35), నాగప్ప అనే భార్యాభర్తలు అద్దెకు దిగారు. కొన్ని రోజులు గడిచాక శ్రీదేవి సిద్దార్థతో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయంతోనే శ్రీదేవి సిద్దార్థతో ప్రేమాయణం సాగించింది. ఇలా ఇద్దరు కలిసి భర్తకు తెలియకుండా ఎంజాయ్ చేస్తూ తిరిగారు. శ్రీదేవి సైతం భర్తను కాదని సిద్దార్థను నమ్మించి అతనితో తిరిగింది. సిద్దార్థ కూడా అన్ని మరిచిపోయి ఉన్న రెండు కార్లు సైతం అమ్మి ప్రియురాలితో జల్సాలు చేశాడు. ఈ క్రమంలోనే సిద్దార్థ శ్రీదేవిని తీసుకుని తన సొంతూరుకు వెళ్లాడు. ఇక కొన్నాళ్లకి సిద్దార్థ వద్ద ఉన్న డబ్బులు పూర్తిగా అయిపోవడంతో శ్రీదేవి మెల్లగా ప్రియుడి చెంత నుంచి జారుకుని మళ్లీ భర్త వద్దకు వెళ్లింది.
ఉన్నట్టుండి ప్రియురాలు తనను వదిలి వెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సిద్దార్థ ఓ సారి ఆత్మహత్యాయత్నానికి కూడా సిద్దపడ్డాడు. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు నచ్చజెప్పి ఇంటి వద్దే ఉండాలని చెప్పారు. కొన్నాళ్ల పాటు ఊర్లోనే ఉన్న సిద్దార్థకు తన ప్రియురాలిని చూడాలనిపించినప్పుడల్లా బెంగుళూరుకు చేరుకునేవాడు. అలా ఇద్దరు ఓ చోట కలుసుకుని మాట్లాడుకునేవారు. కొన్నిరోజులు గడిచాక… ఇక నుంచి నా వద్దకు నువ్వు రావొద్దని శ్రీదేవి సిద్దార్థకు వార్నింగ్ ఇచ్చింది. అయినా వినని ఈ పిచ్చి ప్రేమికుడు అలాగే అనేక సార్లు శ్రీదేవి వద్దకు వెళ్లి వస్తుండేవాడు.
అలా వస్తు పోవడంతో శ్రీదేవికి సిద్దార్థపై కోపం పెరిగింది. ఇలా అయితే కాదని భావించిన శ్రీదేవి ప్రియుడైన సిద్దార్థను చంపాలని ప్లాన్ గీసింది. ఇందులో భాగంగానే శ్రీదేవి ప్రియుడు సిద్దార్థను నమ్మించి బాడియాళ ప్రాంతానికి రమ్మని చెప్పింది. వచ్చిన వెంటనే ఆమె భర్త నాగప్ప, ఆమె సోదరుడితో కలిసి ప్రియుడు సిద్దార్థను దారుణంగా హత్య చేయించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా.. శ్రీదేవి, ఆమె భర్త నాగప్ప పలువురు కలిసి సిద్దార్థను హత్య చేశారని తేలింది. దీంతో పోలీసులు నిందితులను వారిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.