ఊళ్లో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర. ఈ వేడుకలో గ్రామంలోని ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. కానీ, వీళ్లు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తించారు. అసలేం జరిగిందంటే?
కర్ణాటక రాష్ట్రంలోని హళ్లూరు గ్రామం. ఈ ఊళ్లో 12 ఏళ్లకు ఒకసారి మహాలక్ష్మి జాతర ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా చేయడానికి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక ఊరంతా ఎంతో ఆనందంగా జాతర పాల్గొన్నారు. కానీ, అదే గ్రామానికి చెందిన చంద్రకాంత మావరకర్, సావిత్రి దంపతులు మాత్రం ఎవరూ ఊహంచని విధంగా ప్రవర్తించారు. ఆ తర్వాత జరిగిన పరిణామంతో గ్రామంలో తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బెళగావి జిల్లా మూడలగి పరిధిలోని హళ్లూరు గ్రామం. ఇక్కడే చంద్రకాంత మావరకర్ (42), సావిత్రి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారుల సంతానం. గ్రామంలోనే కూలీనాలి పనులకు వెళ్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉంటే, హళ్లూరు గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి మహాలక్ష్మి జాతర జరుగుతుంది. ఈ సారి కూడా ఆ వేడుకలను ఘనంగా చేయడానికి ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. ఇక ఆ రోజు కూడా రావడంతో ఆదివారం మహాలక్ష్మి తల్లి దేవత జాతర ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి.
ఇందులో భాగంగానే ఊరంతా సంబరాల్లో మునిగిపోయారు. అదే ఉత్సవాల్లో చంద్రకాంత మావరకర్, సావిత్రి భార్యాభర్తలు సైతం పాల్గొన్నారు. కానీ, ఈ దంపతులు అతిగా మద్యం సేవించి జాతరలోనే గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వీరి కుమారుడు ఇద్దరినీ మందలించాడు. ఇక అదే రోజు తెల్లవారు జామున కూడా ఈ దంపతులు ఇంట్లో మరోసారి వాగ్వాదానికి దిగారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన సావిత్రి.. తన కుమారుడితో కలిసి భర్త చంద్రకాంత మావరకర్ ను దారుణంగా కొట్టింది.
వీరి దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో అతడు చికిత్స పోందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక పక్క గ్రామంలోని ప్రజలు జాతరలో సాంతోషంగా పాల్గొంటే, ఈ దంపతులు మాత్రం గొడవపడి చివరికి చంద్రకాంత మావరకర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.