కర్ణాటకలోని నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి జబాగుడ. ఇదే గ్రామానికి చెందిన తిలై హరిజన్(18), దమాపల్లి గ్రామానికి చెందిన డోంబురు హరిజన్(19)కి పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చడంతో వీరు ప్రపంచాన్ని మరిచి ప్రేమించుకున్నారు. దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఇష్టపడ్డారు కాబట్టి ఎలాగైన పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
ఇక ఇదే విషయమై ఇరువురి బంధువులకు తెలియజేశారు. కానీ వీరి పెళ్లికి వారిద్దరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పరువు కోసం పాకులాడిన వీరిద్దరి కుటుంభికులు పెళ్లికి ఒప్పుకునేది లేదని తేల్చేశారు. దీంతో పెద్దల నిర్ణయంతో ఈ జంట జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర మనస్థాపానికి గురైన ఈ జంట మంగళవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. దీంతో వారిద్దరి కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతాల్లో గాలించారు. కానీ వీరి జాడ మాత్రం ఎక్కడ కూడా దొరకలేదు. ఇక వారిద్దరి తల్లిదండ్రులు ఖంగారుపడ్డారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: భార్యపై మొదటి నుంచే భర్తకు డౌట్.. ఓ రోజు భార్య చేతులు, కాళ్లు కట్టేసి!
అలా వెతుకున్న క్రమంలనే బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని జీడితోటలో చెట్టుకు వేలాడుతున్న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.