దేశంలో దారుణాల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రేమ గొడవలు, వివాహేతర సంబంధాలు, వరకట్న వేధింపులు, స్థిరాస్థి గొడవలు వంటి వాటిల్లోనే హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే కనిపెంచిన కొడుకుని ప్రాణంగా చూసుకోవాల్సిన ఓ తండ్రి కిరాతకానికి పాల్పడ్డాడు. కిరాయి హంతకులతో కలిసి తండ్రి కుమారుడిని హత్య చేయించాడు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హుబ్లీలో నగరంలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుపొందిన భరత్ జైన్ కుమారుడు అఖిల్ జైన్ గత ఐదు రోజుల నుంచి కనిపించుకండపోయిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. పోలీసుల విచారణల్లో భాగంగా ముందుగా అఖిల్ జైన్ ఇంటి సభ్యులను విచారించారు. దీంతో అందరి మొబైల్ ఫోన్ లను తీసుకుని పరిశీలించారు. ఇక చివరగా తండ్రి భరత్ జైన్ మొబైల్ ను సైతం పోలీసులు పరిశీలించగా ఊహించని నిజాలు బయటపడ్డాయి.
తండ్రి భరత్ జైన్ అఖిల్ కనిపించకుండపోయే ముందు రోజుల నుంచి కొంతమంది రౌడీలతో మాట్లాడినట్లుగా పోలీసులు అనుమనిస్తున్నారు. చివరికి పోలీసుల స్టైల్ లో తండ్రిని భరత్ ను విచారించగా అసలు నిజాలు వెళ్లగక్కాడు. అవును.. నేనే కిరాయి హంతకులను పెట్టి నా కుమారుడిని హత్య చేయించానని తెలిపాడు. తండ్రి మాటలను విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక ఈ ఘటనను మరింత సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అసలు నిజంగానే కుమారుడి హత్యకు తండ్రి సుపారీ ఇచ్చాడా? అసలు తండ్రి కుమారుడు అఖిల్ ను జైన్ హత్య చేయించడానికి గల కారణం ఏంటి? మృతదేహాన్ని ఎక్కడ పడేశారనన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.