నేటి విద్యార్థులను రేపటి బావి భారత పౌరులుగా తీర్చుదిద్దాల్సిన కొందరు గురువులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అందమైన విద్యార్థులపై ఓ కన్నేసి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలా కొంత మంది నీచపు మాస్టార్లు గలీజ్ పనులకు శ్రీకారం చుడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ మాస్టారు స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థినులతో పాడుపనులకు తెర లేపాడు. ఇక అమాయకపు విద్యార్థులపై ఊహించని దారుణానికి పాల్పడి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మారుతోంది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది కర్ణాటక హసన్ జిల్లా అరకలగూడు ప్రాంతం. ఇక్కడే ఓ పాఠశాలలో శివకుమార్ అనే వ్యక్తి హెడ్ మాస్టార్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ విద్యావంతుడు రాను రాను దుర్మార్గుడిలా మారిపోయాడు. స్కూల్ లో అందమైన బాలికపై కన్నేయడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి చేసేవాడు. ఇదిలా ఉంటే ఈ దుర్మార్గుడు స్కూల్లో కొంతమంది విద్యార్థినులను వరుసగా నిలబెట్టి అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే కాకుండా శివకుమార్ స్పెషల్ క్లాసులు అంటూ కొంతమంది విద్యార్థినులను క్లాసులకు పిలిచేవాడు. ఇక ఆ బాలికలు వచ్చిన వెంటనే వారిపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, లైంగికంగా వేధించడం వంటివి చేసేవాడు.
ఇక చాలా కాలం నుంచి ఇతగాడి వేధింపులను భరించిన విద్యార్థులు ఇక తట్టుకోలేకపోయారు. దీంతో ఆ విద్యార్థులు ఇటీవల పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. చదువు నేర్పాల్సిన గురువే ఇలా గలీజ్ పనులకు పాల్పడడం ఎంత వరకు కరెక్ట్? ఇలాంటి దుర్మార్గులకు మీరే అయితే ఎలాంటి శిక్ష విధిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.