అందమైన ఫ్యామిలీ. రాత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. దంపతులిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. దీంతో వీరి సంసారంలో ఎలాంటి కష్టాలు, మనస్పర్ధలు లేకుండా ఆనందంగా సాగుతూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఈ దంపతులిద్దరూ వారంతంలో విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం.. ఇద్దరు పిల్లలను తీసుకుని ఇటీవల కారులో విహారయాత్రకు బయలుదేరారు. ఇక ముందుగా ఓ దేవుడిని దర్శించుకుని మరో దేవుడి దర్శనానికి వెళ్తున్నారు. ఇక అంతలోనే జరిగిన ఊహించని ప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. వీరికి ఏ ప్రమాదం జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అనంతపురం జిల్లా ఉరవకొండ పరిధిలోని ముష్టూరుకు చెందిన శ్రీకాంత్ (36), ప్రతీక్ష(35) దంపతులు. వీరికి గతంలో వివాహం జరిగింది. దంపతులిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కూతురు, కుమారుడు జన్మించారు. పుట్టిన పిల్లలతో ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. ఎలాంటి మనస్పర్ధలు లేకుండా వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ ఉంది. ఇక రోజూ ఆఫీసులకు వెళ్లే ఈ దంపతులు ఈ వారంతంలో ఓ విహారయాత్రకు కర్ణాటకకు వెళ్లాలనుకున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఈ దంపతులు కారులో తమ పిల్లలతో సహా విహారయాత్రకు బయలుదేరారు.
ముందుగా బెంగుళూరులోని మంజునాథస్వామిని దర్శించుకున్నారు. ఇక అనంతరం శృంగేరికీ బయలుదేరారు. ఇక ఉడుపి జిల్లాలొ వీరు ప్రయాణిస్తున్న కారును ఓ ప్రైవేట్ బస్సు వెనకాల నుంచి వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులతో పాటు వారి కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇక కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక గాయపడ్డ కుమారుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.