అందమైన ఆడది కనిపిస్తే చాలు కొందరు సైకో గాళ్లు చూపులతోనే కాటేస్తుంటారు. చివరికి ప్రేమించాలని వెంటపడతారు. కాదు, కూడదు అన్న మాటలు అమ్మాయి నుంచి వినిపించాయా ఇక అంతే.. హత్యలు చేయడం, లేదంటే అత్యాచారం చేయడం. ఇవే నేటి రోజుల్లో జరుగుతున్న దారుణాలు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ సైకో కిల్లర్ యువతి ప్రేమకు నిరాకరించిందని కారుతో ఢీ కొట్టి హత్య చేశాడు. ఇటీవల కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసులు తెలిపిన కథనం మేరకు.. కర్ణాటకలోని హసన్ జిల్లాలోని సక్లేష్ పూర్ ప్రాంతంలో భరత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే స్థానికంగా ఉండే శరణ్య అనే యువతిపై భరత్ మనసుపడ్డాడు. కొన్నాళ్ల నుంచి ప్రేమించాలని వెంటపడ్డాడు. కానీ ఇతని ప్రేమను శరణ్య రిజక్ట్ చేస్తూ వచ్చింది. ఇక కోపంతో ఊగిపోయిన భరత్ సైకోగా తన అసలు రూపాన్ని చూపించాడు. అయితే ఇటీవల శరణ్య బూవనవళ్లి అనే ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తోంది.
కాగా ఎలాగైన శరణ్యను హత్య చేయాలని పగబట్టిన భరత్ వెళ్తున్న శరణ్యను కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శరణ్య తీవ్ర గాయాలపాలైంది. వెంటనే గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందిన శరణ్య ఇటీవల మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.