వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కులాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కట్ చేస్తే.. ఆ యువతి ఇంట్లో శవమై తేలింది. అసలేం జరిగిందంటే?
వాళ్లిద్దరూ ప్రేమికులు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇద్దరి కులాలు వేరు కావడంతో కాస్త ఆలోచించారు. అయినా సరే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఈ దంపతులు కొంత కాలం పాటు బాగానే ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఏడాది తిరిగేసరికి యువతి అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మరణించింది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
కర్ణాటక బళ్లారి పరిధిలోని చిత్రదుర్గ ప్రాంతం. ఇక్కడే యాదవ కులానికి చెందిన చిత్రలింగప్ప, దళిత సామాజిక వర్గానికి చెందిన పూర్ణిమ ఇద్దరూ తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేవారు. అలా కొంత కాలం తర్వాత ఇద్దరికి పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త చివరికి ప్రేమగా మారింది. ఇక రాను రాను ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దల వీరి పెళ్లికి అంగీకరించలేదు. అయినా సరే చివరికి పెద్దలను ఎదురించి గుడిలో పెళ్లి చేసుకున్నారు.
ఇక పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు బాగానే ఉన్నారు. కానీ, రాను రాను భర్త పూర్ణిమను పుట్టింటి నుంచి కట్నం తేవాలని వేధించినట్లు తెలుస్తుంది. అయితే ఇదే విషయమై భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే పూర్ణిమ ఉన్నట్టుండి ఇంట్లో శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పూర్ణిమ తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా కూతురుని అల్లుడు చిత్రలింగప్పే కొట్టి చంపాడని, గత కొంత కాలం నుంచి కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకుని చివరికి కట్నం తేవాలంటూ మా కూతురుని హత్య చేశాడంటున్న మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.