ఆ బాలిక పేరు శ్రీవర్ష. వయస్సు 16 ఏళ్లు. అయితే ఉన్నట్టుండి ఈ నెల 13 నుంచి ఎవరికీ కనిపించకుండపోయింది. దీంతో ఖంగారుపడ్డ ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8 రోజులైనా కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఆ బాలిక పేరు శ్రీవర్ష. వయస్సు 16 ఏళ్లు. అయితే ఉన్నట్టుండి ఈ నెల 13 నుంచి కనిపించకుండపోయింది. దీంతో ఖంగారుపడ్డ ఆ బాలిక తల్లిదండ్రులు బంధువులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ఇక దీంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సైతం గాలించారు. అయినా, కూతురి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. అది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేల్ది గ్రామం. ఇక్కడే రామగిరి నాంపల్లి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి శ్రీవర్ష (16) అనే కూతురు ఉంది. అయితే ఈ నెల 13 నుంచి ఉన్నట్టుండి ఆ మైనర్ బాలిక ఎవరికీ కనిపించకుండపోయింది. దీంతో ఖంగారుపడ్డ ఆ బాలిక తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. ఇక దీంతో పాటు కూతురి ఆచూకి గురించి బంధువులకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. అయినా కూతురి ఆచూకి మాత్రం దొరకలేదు.
ఇక చేసేదేంలేక ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు.. మా కూతురు ఈ నెల 13 తేదీ నుంచి కనిపించడం లేదని వెతికి పెట్టాలంటూ ఫిర్యాదు చేశారు. శ్రీవర్ష తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా.. వేల్ది నుంచి శ్రీనివాస్ నగర్ వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించినట్లుగా తెలుస్తుంది. కానీ, అందులో ఆ బాలికకు సంబంధించిన ఎలాంటి దృశ్యాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు.
అయితే త్వరలోనే ఆ బాలికను వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇక ఆ బాలిక ఎక్కడికి వెళ్లింది. నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేశారా? అసలేం జరిగిందనే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 8 కూతురి ఆచూకి దొరకకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ ఘటనతో ఆ బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.