కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంచాయితీ కార్మికుడు ఏకంగా ఆఫీసులోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
సమాజంలోని కొందరు వ్యక్తులు చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతూ కన్నవాళ్లకి కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. తాజాగా తెలంగాణలో ఓ పంచాయితీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఏకంగా పంచాయితీ కార్యాలయంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడడంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ఓ గ్రామం. ఇక్కడే కొంగరి రవిబాబు (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని భార్య గర్బవతిగా ఉంది. రవిబాబు ఇదే గ్రామంలో గత 8 ఏళ్ల నుంచి పంచాయితీలో వాటర్ మెన్ గా పని చేస్తున్నాడు. అతనికి నెల నెల వచ్చే రూ. 8,500 జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత రెండు నెలల నుంచి జీతం రావడం లేదు. దీంతో ఆర్థికంగా రవిబాబు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక భార్య ప్రసవం టైమ్ దగ్గరపడుతుంది.
చేతిలో చిల్లగవ్వ లేదు. తెలిసిన బంధువులను, కుటుంబ సభ్యులను అందరినీ అడిగారు. కానీ, ఎవరూ కూడా అతనికి సాయం చేయడానికి ముందు రాలేదు. ఈ సమయంలో అతనికి ఏం చేయాలో తోచలేదు. ఇక మనస్థాపంతో రవిబాబు చేసేదేం లేక తాజాగా పంచాయితీ ఆఫీసులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సీన్ చూసిన కొందరు గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రావిబాబు మృతదేహాన్ని పరిశీలించారు.
అనంతరం అతడి మృతదేహాన్ని కిందకు దించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న భర్త ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడంతో భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జీతం రాలేదని పంచాయితీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకున్న రవిబాబు ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.