అక్రమ సంబంధం.. ఇవే సాఫీగా సాగుతున్న దాంపత్య జీవితాల్లో నిప్పులు పోస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతూ చివరికి హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ భార్య ప్రియుడి మాయలో పడి భర్తను దారుణంగా హత్య చేసి భూమిలో పాతి పెట్టింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచనలంగా మారుతోంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రమేష్, వెన్నెల ఇద్దరు భార్యాభర్తలు. వీరిద్దరూ కూలీ పనుల నిమిత్తం కామారెడ్డిలోని ఎల్లారెడ్డిలో నివాసం ఉంటున్నారు. భర్త స్థానికంగా కొత్తగా నిర్మించతలపెట్టిన ఇంటికి వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. వచ్చిన డబ్బులతో దంపతులిద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. కానీ పాడు బుద్దిని ప్రయోగించిన భార్య వెన్నెల వికారాబాద్ జిల్లాకు చెందిన దస్తప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. కొన్నాళ్ల పాటు వెన్నెల భర్తకు తెలియకుండా చీకటి కాపురాన్ని బాగానే లీడ్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఈ క్రమంలో భర్తతో ఉండడం ఇష్టం లేని వెన్నెల ఎలాగైన తాళికట్టిన భర్తను మట్టుబెట్టాలనే ప్లాన్ గీసింది. ఇందులో భాగంగానే వెన్నెల ప్రియుడు దస్తప్పతో పాటు ఇటీవల భర్తను చంపి కొత్తింట్లో పాతిపెట్టింది.
ఇది కూడా చదవండి: తనకు HIV సోకిన విషయం తెలిసినా వదలలేదు.. పిల్లలు పుట్టడం లేదని!
అయితే ఈ విషయం మెల్లగా పోలీసుల వరకు వెళ్లింది. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అనుమానం వచ్చిన పోలీసులు రమేష్ భార్యను తమదైన స్టైల్లో విచారించగా భార్య అసలు నిజాలు బయటకు కక్కుతూ ప్రియుడితో పాటు నేనే నా భర్తను హత్య చేశానని తెలిపింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి వెన్నెలతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.