గురువారం ఓ కారణంతో తండ్రీకొడుకులు పొలం వద్ద గొడవ పడ్డారు. ప్రాణ భయంతో తండ్రి రాజయ్య.. అక్కడే ఉన్న గడ్డపారతో కొడుకు నవీన్ పై తండ్రి దాడి చేశాడు. ఈ దాడిలో కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అసలేం జరిగిందంటే?
తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవలో చివరికి ఓ నిండు ప్రాణం పోయింది. తాజాగా జనగామ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు తండ్రి కొడుకుల మధ్య గొడవకు కారణం ఏంటి? దానికే తండ్రి కొడుకుని అంత దారుణంగా హత్య చేయాలా? ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామం. ఇక్కడే రాజయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి నవీన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే రాజయ్య తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక కొడుకు పెద్దవాడై పెళ్లీడుకొచ్చాడు. ఈ క్రమంలోనే కొడుకు నవీన్ తండ్రితో పెళ్లి చేయాలని అడిగాడు. దీనికి తండ్రి కూడా సరేనన్నాడు. అలా కొన్ని రోజులు గడిచింది. ఈ మధ్య కాలంలో.. పెళ్లితో పాటు భూమిని కూడా పంచాలంటూ నవీన్ కొత్త రాగాన్ని ఎత్తుకున్నాడు.
ఇక ఇదే అంశంపై కొడుకు నవీన్ తండ్రితో గత కొన్ని రోజుల నుంచి తండ్రితో పట్టుబట్టాడు. అయితే గురువారం తండ్రీకొడుకులు పొలం వద్ద మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కోపంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన నవీన్.. తండ్రిపై దాడి చేసి చేసినట్లు సమాచారం. ఇక ప్రాణ భయంతో తండ్రి రాజయ్య.. అక్కడే ఉన్న గడ్డపారతో కొడుకు నవీన్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కొడుకు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఆ సమయంలో రాజయ్యకు ఏం చేయాలో అస్సలు తోచలేదు. ఇక చేసేదేం లేక పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు రాజయ్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నవీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.