Crime News: జమ్మూలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ బుధవారం ఒకే ఇంట్లో ఆరు శవాలు వెలుగు చూశాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జమ్మూ, సిధార ఏరియాలోని టావి విహార్‌కు చెందిన ఓ ఇంట్లో సకినా బేగం, నసీమా అక్తర్, రుమినా బానో, జాఫర్ సలీమ్, నూర్ ఉల్ హబీబ్, సజద్ అహ్మద్‌లు నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం వారు అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. దీనిపై పొరిగిళ్ల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు శవాలను స్వాధీనం చేసుకున్నారు.
శవాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులను విచారించి వివరాలు రాబడుతున్నారు. అయితే, ఆ ఆరుగురు ఎలా చనిపోయారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వారందరూ సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారా? లేక ఎవరైనా వారిని చంపేశారా? ప్రమాదవశాత్తు చనిపోయారా? అన్నది మిస్టరీగా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : యువతిపై స్నేహితురాలి అరాచకం.. తండ్రిని పెళ్లిచేసుకోలేదని..