ఆమెకు 2014లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి ఓ కొడుకు, కూతురు పుట్టి మరణించారు. ఆ తర్వాత అనారోగ్యంతో భర్త కూడా మరణించాడు. ఇటీవల చూసుకున్న తల్లి కూడా చనిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆమె పేరు సుమలత. వయసు 38 ఏళ్లు. 2014లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు భర్తతో సంతోషంగా జీవించింది. మంచి మొగుడు దొరికాడని ఆ మహిళ ఎంతో సంతోషపడింది. అయితే ఈ క్రమంలోనే ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పట్టడంతో దంపతులు ఇద్దరూ మురిసిపోయారు. కానీ, ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. పుట్టిన కొన్ని రోజులకే ఆమె కుమారుడు మరణించాడు. కట్ చేస్తే కొంత కాలనికి ఓ కూతురు జన్మించింది. ఆ బాలిక కూడా రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా బుగ్గారానికి చెందిన పన్నాలి సుమలత (38)కు గంగాధర్ అనే వ్యక్తితో 2014లో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు సంతోషంగా జీవించారు. కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడని ఆ దంపతులు సంభరపడేలోపే ఆ బిడ్డ చనిపోయాడు. దీంతో ఆ భార్యాభర్తలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత కొంత కాలానికి ఓ కూతురు జన్మించింది. ఆ బాలిక పెరిగి పెద్దైంది. కాగా, గతంలో ఉన్నట్టుండి ఓ రోడ్డు ప్రమాదంలో సుమలత కూతురు కూడా మరణించింది.
కొడుకు, కూతురు పుట్టినవారు పుట్టినట్టే చనిపోవడంతో భర్త గంగాధర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అతడు అనారోగ్యానికి గురై కొన్నాళ్లకి మృతి చెందాడు. దీంతో ఆ వివాహిత దిక్కుమొక్కులేకపోవడంతో పుట్టింటికి వెళ్లి తల్లితో పాటు అక్కడే ఉండేది. ఇదిలా ఉంటే సుమలత తల్లి కూడా ఇటీవల అనారోగ్యంతో మరణించింది. నా అనుకున్న వారంతా ఒక్కొక్కరుగా చనిపోవడంతో సుమలత తట్టుకోలేకపోయింది. ఇలాంటి బతుకు నాకెందుకు ఆ వివాహిత.. ఇటీవల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.