హైదరాబాద్ లో లంగర్ హౌజ్ వద్ద దారుణం చోటు చేసుకుంది. గర్ల్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పాడని పదో తరగతి విద్యార్థులు కత్తులతో పొడుచుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది లంగర్ హౌజ్ లోని బాపుఘాట్ ప్రాంతం. తన గర్ల్ ఫ్రెండ్ కు దుర్గ ప్రసాద్ హాయ్ చెప్పాడని ఓ స్టూడెంట్ తన సహచర విద్యార్థులకు చెప్పాడు. దీంతో దుర్గా ప్రసాద్ పై తన సహచర ఫ్రెండ్స్ పగ పెంచుకున్నారు.
దీంతో అందరూ కలిసి దుర్గ ప్రసాద్ నమ్మించి దాడి చేయాలని ప్లాన్ వేశారు. అయితే దుర్గ ప్రసాద్ ను నమ్మించిన తన సహచర ఫ్రెండ్స్ పార్టీ చేసుకుందామంటూ ఫిల్మ్ నగర్ కు పిలిచారు. అక్కడ దర్గ ప్రసాద్ తో పాటు అందరు కలిసి పార్టీ చేసుకున్నారు. అనంతరం దుర్గ ప్రసాద్ ను నమ్మించి అటు నుంచి రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ లోని మూసి నది వద్దకు తీసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Chennai: భర్తపై కోపం.. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసిన భార్య!
ఇక అక్కడికి చేరుకున్నాక దుర్గ ప్రసాద్ ను.. తన గర్ల్ ఫ్రెండ్ కు ఎందుకు హాయ్ చెప్పావంటూ అందరూ కలిసి నిలదీశారు. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు విద్యార్థులు ఏకంగా వెంట తెచ్చుకున్న కత్తులతో దుర్గప్రసాద్ పై దాడికి యత్నించారు. ఇక ఆ యువకుడు కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. ఇక స్థానికుల రాకను గమనించిన సదరు విద్యార్థులు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఇక తీవ్ర గాయాలపాలైన దుర్గ ప్రసాద్ ను స్థానికులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర లలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.