hyderabad : పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురాశతో ఓ ఐటీ ఉద్యోగి గంజాయి విక్రేతగా మారింది. అరకు నుంచి సరుకు తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తూ దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాన్సీ అనే మహిళ భర్త మదన్ మనేకర్‌తో కలిసి నగరంలోని నాచారంలో ఉంటోంది. ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. భర్తతో కలిసి ఆమె గత రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తోంది. అరకు నుంచి సరకు తీసుకువచ్చి మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్, పంజాగుట్ట, బంజారాహిల్స్‌లలో అమ్మాకాలు సాగిస్తోంది.
గత నెల 12వ తేదీన భార్యభర్తలిద్దరూ మరో యువకునితో కలిసి గంజాయి విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకోగా యువకులు దొరికిపోయారు. భార్యభర్తలు పారిపోయారు. ఇద్దరు యువకులు ఇచ్చిన సమాచారంతో గురువారం మాన్సీని అరెస్ట్ చేశారు. మాన్సీ పూర్వీకులు ఏపీ నుంచి నాగ్‌పూర్ వలస వెళ్లారని, భోపాల్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : లవర్ తో భార్య సీక్రెట్ ఛాటింగ్.. అసలు విషయం భర్తకు తెలియడంతో ఊహించని సీన్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.