వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం వరకు ఎలాంటి గొడవలు, మనస్పర్దలు లేకుండా సంసారాన్ని ఈడ్చుకొస్తున్నారు. అలా సంతోషంగా సాగుతున్న సంసారంలో భర్త నిప్పులు పోశాడు. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా HIV రక్తం ఎక్కించాడు. దీంతో కొన్నాళ్లకు అసలు విషయం భార్యకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. అనంతరం భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త భార్యకు ఎందుకు HIV రక్తం ఎక్కించాడు? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో చరణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి 5 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కొంత కాలం పాటు భార్యతో సంసారం బాగానే చేశాడు. కానీ రోజులు గడిచే కొద్ది భర్త పక్కదారుల్లోకి వెళ్లాడు. కట్టుకున్న పెళ్లాన్ని కాదని పరాయి సుఖం కోసం పాకులాడాడు. ఇక స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. భార్యను కాదని సమయం దొరికినప్పుడల్లా ప్రియురాలితో ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు. ఇక రాను రాను భర్త భార్యతో ఉండడం కన్నా ప్రియురాలితో ఉండేందుకు ఇష్టపడ్డాడు. కానీ అతని భార్య అడ్డుగా ఉండడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు.
అప్పుడే మనోడికి ఓ దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. భార్యకు HIV రక్తం ఎక్కించి విడాకులు తీసుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే గతంలో భార్య గర్భవతిగా ఉన్న సమయంలోనే ఓ RMP వైద్యుని సాయంతో భర్త భార్యకు HIV రక్తాన్ని ఎక్కించాడు. కొంత కాలం తర్వాత నీకు HIV ఉందని తెలిపి విడాకులు కోరాడు. కానీ భార్యకు భర్తే HIV రక్తాన్ని ఎక్కించాడని అసలు విషయం తెలిసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భార్య ఒక్కసారిగా షాక్ కు గురైంది. అనంతరం భర్త చేసిన దారుణంపై పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారుతోంది. ప్రియురాలి మోజులో పడి భార్యపై ఇంతటి దారుణానికి పాల్పడిన భర్త తీరు ఎంత వరకు కరెక్ట్? ఇతనికి మీరైతే ఎలాంటి శిక్ష విధిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.