భర్త కళ్ల ఎదుటే భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణాన్ని ఆపకుండా ఉరి వేసుకోమని చెప్తు.. వీడియో తీశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య కలహాలతో మనస్తాపం చెందిన భార్య ఉరి వేసుకునేందుకు ఇంట్లో ఫ్యాన్‌కు చీరను కట్టుకుంటుండగా ‘వేస్కో వేస్కో బెదిరిస్తున్నావా? నేనే నేడతా ఉండూ ఎవడి కోసం వేస్కుంటాన్నవ్’ అంటూ భర్త పెంచలయ్యా వీడియో తీశాడు. అలా చూస్తుండగానే ఆమె ఉరి వేసుకుని విగతజీవిగా మారింది. పోలీసు భర్త పెంచలయ్యను అరెస్ట్ చేశారు.