Nizamabad: ఎన్నో ఆశలతో.. మరెన్నో ఊహలతో భర్తతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ మహిళకు నిరాశే ఎదురైంది. తాను ఎంత ప్రేమించినా భర్త మాత్రం ద్వేషించేవాడు. ప్రతి రోజు నరకం చూపించేవాడు. ఈ నరకంలోనూ తల్లి కాబోతున్నానన్న వార్త ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. భర్త బాధించినా.. పుట్టబోయే బిడ్డకోసం బతకాలనుకుంది. కానీ, భర్త నరరూప రాక్షసుడిలా మారి, రెండో పెళ్లి కోసం ఆమెను బలితీసుకున్నాడు. నోట్లో ఎలుకల మందు కలిసిన యాసిడ్ పోసి అతి క్రూరంగా చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్ తండాకు చెందిన కళ్యాణికి రాజిపేటకు చెందిన తరుణ్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. ఈ ఇద్దరూ ఓ ఏడాది మంచిగా కాపురం చేశారు. ఆ తర్వాతినుంచి కాపురంలో గొడవలు మొదలయ్యాయి.
ఆమె తనకు సరైన జోడీ కాదని, రెండో పెళ్లి చేసుకుంటానని తరుణ్ భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. తండ్రి, బావమరిదితో మర్డర్ ప్లాన్ వేశాడు. మంగళవారం ఉదయం ముగ్గురు కలిసి కళ్యాణి నోట్లో బలవంతంగా ఎలుకల మందు కలిపిన యాసిడ్ పోశారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆమె మరణించింది. కళ్యాణి మృతితో ఆమె బంధువులు తరుణ్ ఇంటిపై దాడిచేసి అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. మృతురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : హీరోపై లైంగిక ఆరోపణలు.. అవకాశాల పేరుతో వాడుకున్నాడని మహిళ ఫిర్యాదు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.